Monday, April 29, 2024
- Advertisement -

ఫామ్‌లోకి వచ్చిన ఆసీస్..ఈ జోరు కంటిన్యూ చేస్తారా?

- Advertisement -

5 సార్లు ప్రపంచ ఛాంపియన్స్..కానీ ఈ సారి పేలవ ప్రదర్శనతో ప్రారంభించారు. వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో 62 పరుగుల తేడాతో విజయం సాధించారు.

368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్…45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీఖ్‌ (64), ఇమాముల్‌ హక్‌ (70)అద్భుత శుభారంభాన్ని అందించినా తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు భారీ స్కోరు చేయలేదు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (18), మహమ్మద్‌ రిజ్వాన్‌ (46), సౌద్‌ షకీల్‌ (30), ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (26), మహమ్మద్‌ నవాజ్‌ (26) విఫలం కావడంతో పాక్ ఓటమి తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో జాంపా 4, కమిన్స్‌, స్టోయినిస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించారు. ఓ దశలో పాకిస్థాన్ 400 పరుగులు దాటడం ఖాయమని అంతా అనుకున్నారు అయితే చివర్లో పాక్ బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 9 వికెట్లు కొల్పోయి 367 పరుగులు చేసింది ఆసీస్. డేవిడ్‌ వార్నర్‌ 124 బంతుల్లో 9 సిక్స్‌లు, 14 ఫోర్లతో 163 పరుగులు చేయగా మిషెల్‌ మార్ష్‌ 108 బంతుల్లో 9 సిక్స్‌లు, 10 పోర్లతో 121; పరుగులు చేశారు. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఈ జోరును కొనసాగించడంలో విఫలమయ్యారు. మ్యాక్స్‌వెల్‌ (0),స్టీవ్‌ స్మిత్‌ (7), స్టోయినిస్‌ (21), జోష్‌ ఇంగ్లిస్‌ (13), లబుషేన్‌ (8) విఫలమయ్యారు. వార్నర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -