Saturday, April 20, 2024
- Advertisement -

డేవిడ్ వార్నర్ పై నటి ఈషా రెబ్బా ఫన్నీ కామెంట్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో నటి ఈషా రెబ్బా గురించి తెలియని వారు ఉండరు. ఈ అమ్మడు మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నా.. కరెర్ పరంగా పరవాలేదు అనిపించుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈషా రెబ్బా అచ్చమైన తెలుగు అమ్మాయి. చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోయిన్ గా రాణిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై ఫన్నీగా సెటైర్లు వేసింది. ఆదివారం నాడు ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని జట్టు, సూపర్ ఓవర్ లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో ఓటమి పాలు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్ ఈషా రెబ్బ వార్నర్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. వార్నర్ అన్నా… ఇదేంటి? సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు నువ్వెందుకు వెళ్లావు? బెయిర్ స్టో, సుచిన్ ను ఎందుకు కాదన్నావు? నువ్వు ప్రయోగాలు చేయాలనుకుంటే డ్రీమ్ 11లో చేసుకో అని వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్లు ఇంకా మ్యాచ్ లు ఉన్నాయంటూ ఈషారెబ్బను ఓదార్చే ప్రయత్నం చేశారు.

18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌!

నేటి పంచాంగం,మంగళవార(27-04-2021)

పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ తీరు ఇలా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -