ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. గతంలో ఓ జట్టులో సెంచరీ చేస్తే చాలు ఆ జట్టు విజయం సాధించినట్లు లెక్కలు వేసుకునేవారు. అయితే ఇప్పుడు విజయానికి సెంచరీలు కూడా సరిపోవడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది.
అజింక్య రహానే 105 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. చాలాకాలం తరువాత రహానే నుంచి సెంచరీ వచ్చింది.కెప్టెన్ స్మిత్ (50) అర్థ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది.ధావన్ ( 54) అర్థ సెంచరీతో రాణించగా, రిషభ్ పంత్ (78) పవర్ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు. రహానే సెంచరీ కూడా రాజస్థాన్ జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్ విజమంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది.
- Advertisement -
రిషబ్ పంత్ మెరుపులు..రహానే శతకం వృథా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -