Sunday, May 19, 2024
- Advertisement -

మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ష‌మీ నాన్ బెయిల‌బుల్ కేసులు న‌మోదు 

- Advertisement -

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇత‌ర అమ్మాయిల‌తో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయ‌ని ష‌మీ భార్య‌ వెల్ల‌డించిన సంగ‌తి తెల‌సిందే. దీనిలో భాగంగానే భార్య ఫిర్యాదుతో షమీతో పాటూ మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

షమీపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో కొన్ని నాన్ బెయిల్ బుల్ వి కాగా… మరొకొన్నింటిలో పదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. షమీ తనను బాగా టార్చర్ పెట్టేవాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో ఆమె చాలా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అతడితో పాటూ కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దూషించేవారని… మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించిందట. తెల్లవారుజామున 2-3 గంటల వరకు వేధింపులు కొనసాగేవని… తనను చంపేందుకు స్కెచ్ వేశారని… షమి అప్పుడప్పుడు కొట్టేవాడని కూడా కంప్లైంట్ లో పేర్కొందట. ఇలా పక్కా ఆధారాలు ఇవ్వడంతో… షమీ చుట్టూ ఉచ్చు బిగుసుకు పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -