Sunday, May 19, 2024
- Advertisement -

వైసీపీ అవిశ్వాస తీర్మానానికి బాబు మ‌ద్ద‌తు ఇస్తాడా…? ఇవ్వ‌డా…?

- Advertisement -

ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డంలేదు. టీడీపీ మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌ధానంగా ఈనెల 21న వైసీపీ ప్ర‌వేశ పెట్ట‌బోయో అవిశ్వాస తీర్మానంపైనే ఇప్పుడు అంద‌రి చూపు ప‌డింది. అవిశ్వాసాసం పెట్ట‌డానికి వైసీపీకీ , టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చినాస‌రే లేకుంటే మీరు అవిశ్వాసం పెడితే మేము మ‌ద్ద‌తు ఇచ్చేదానికి సిద్దంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

అయితే అవిశ్వాస తీర్మానానికి గండికొట్టేందుకు తెర‌వెనుక చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. దీనికి బ‌లాన్ని చేకూర్చుతూ టీడీపీఎంపీలు త‌మ మంత్రిప‌దవుల‌కు మాత్ర‌మే రాజీనామాలు చేశారు త‌ప్ప ఎన్‌డీఏనుంచి పూర్తిగా వైదొల‌గ‌లేదు. అంటే ఎన్‌డీఏలోనే కొన‌సాగ‌నున్నారు. దీంతో మోదీ ప్ర‌భుత్వానికి పార్ల‌మెంట్‌లో నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశంలేదు.

మొద‌టినుంచి అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఎన్నిసార్లు కోరిగా చంద్ర‌బాబు మాత్రం స్పందించ‌లేదు. ఎన్డీఏలో నుండి పక్కకు తప్పుకోనపుడు మంత్రివర్గంలో ఉంటే ఏమి? రాజీనామాలు చేస్తే మాత్రం ఏంటి? కేంద్రానికి మద్దతైతే కంటిన్యూ అవుతుంది కదా? ఇక కేంద్రానికి వ్యతరేకంగా టిడిపి తీసుకున్న నిర్ణయం ఏముంది?

అందుకే వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు విజయవంతంగా గండికొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏన్డీఏలో ఉంటూ అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతు ఇస్తామని టిడిపి చెప్పుంటుంది. ఈ విషయాన్ని జగన్ గ‌మ‌నించే ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నాడు.

అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి కాంగ్రేస్ సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించింది. ఎన్‌డీఏకు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌నుంచి ప‌దిమంది ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం జ‌గ‌న్‌కు పెద్ద క‌ష్టంకాదు. అవిశ్వాస స‌మ‌యంలో టీడీపీ ఎలా వ్య‌వ‌హిస్తుందో అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చూడాలి చివ‌ర‌కు ఏంజ‌రుగుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -