Sunday, May 5, 2024
- Advertisement -

న్యూజిలాండ్ కొంప ముంచిన రెండు తప్పిదాలు…

- Advertisement -

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో విజ‌యం ఇంగ్లండ్‌నె వ‌రించింది. న్యూజిలాండ్ గెలుస్తుంద‌నుకున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఇంగ్లండ్ విజ‌యం అంద‌ర‌న్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌ తొలుత స్కోర్లు సమమవడంతో టైగా ముగియగా.. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ గెలిచినట్లు ప్రకటించారు.

అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన రెండు తప్పిదాల కార‌ణంగా ఓట‌మి పాల‌య్యింది. నిజానికి 242 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు విజయానికి ఆఖర్లో 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ (84 నాటౌట్: 98 బంతుల్లో 5×4, 2×6) మాత్రమే ఉండ‌టంతో న్యూజిలాండ్ విజ‌యం ఖాయం అనుకున్నారు అంద‌రు. కాని ఆ జ‌ట్టు పేస‌ర్ బౌల్ట్ చేసిన చిన్న త‌ప్పిదం విజ‌యాన్ని దూరం చేసింది.

ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్.. తొలి రెండు బంతులకి రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడో బంతికి ప్లంకెట్ (0) వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్.. తొలి రెండు బంతులకి రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడో బంతికి ప్లంకెట్ (0) వికెట్ పడగొట్టాడు. కాని పొర‌పాటును వెనక్కు వెల్తూ బౌండ‌రీ లైన్ తాక‌డంతో అంపైర్ సిక్స‌ర్‌గా ప్ర‌క‌టించారు.

ఆఖరి ఓవర్‌లో విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. బౌలింగ్‌కి వచ్చిన బౌల్ట్ తొలి రెండు బంతులకీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. బౌలింగ్‌కి వచ్చిన బౌల్ట్ తొలి రెండు బంతులకీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అయితే.. మూడో బంతికి పుంజుకున్న బెన్‌స్టోక్స్ సిక్స్ బాదేశాడు. ఇక నాలుగో బంతిని మిడ్ వికెట్‌ దిశగా తరలించిన స్టోక్స్.. ఒక పరుగు పూర్తి చేసి.. స్రైక్‌ కోసం సాహసోపేతంగా రెండో పరుగుకి వెళ్లాడు. బంతిని అందుకున్న గప్తిల్.. వికెట్ కీపర్‌కి దాన్ని త్రో చేయగా.. అదే సమయంలో క్రీజు వద్ద బెన్‌స్టోక్స్ డైవ్ చేశాడు. దీంతో.. బంతి స్టోక్స్ బ్యాట్‌కి తాకి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో కివీస్‌ షాక్‌కి గురవగా.. ఇంగ్లాండ్‌కి 2+ 4( ఓవర్‌ త్రో) ఆరు పరుగులు వచ్చాయి.

ఫ‌లితం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి రెండో పరుగు తీస్తూ రషీద్, ఆఖరి బంతికి అదే తరహాలో రెండో పరుగు తీస్తూ మార్క్‌వుడ్ రనౌటవడంతో స్కోర్లు సమమయ్యాయి. బౌల్ట్ ఏమరపాటు క్యాచ్, ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో (4 పరుగులు).. ఈ రెండు తప్పిదాలు కివీస్‌ని కప్‌కి దూరం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -