Friday, May 9, 2025
- Advertisement -

గెలుపుతో ఇంగ్లాండ్ ఆత్మ‌విశ్వాసం రెట్టింపు అయ్యింది…బెన్ స్టోక్స్‌

- Advertisement -

ఇంగ్లండుతో జ‌రిగిన మొద‌టి టెస్ట్‌లో విజ‌యం ముంగిట బార‌త్ త‌డ‌బ‌డింది. ఇక మొద‌టి టెస్ట్ విజ‌యంతో ఇంగ్లండు జ‌ట్టులో ఆత్మ‌విశ్వాసం రెట్టింప‌య్యింద‌ని . ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. గత శనివారం ముగిసిన తొలి టెస్టులో బంతితో అద్భుతంగా రాణించిన బెన్‌స్టోక్స్.. ఇంగ్లాండ్ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు దాదాపు గెలిచే స్థితిలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా.. మ్యాచ్‌ని బెన్‌స్టోక్స్ ఇంగ్లాండ్‌వైపు తిప్పాడు. కోహ్లి ఔట్ అనంతరం తడబడిన భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. ఒక వ్యక్తిని గాయపరిచిన కేసులో కోర్టుకి హాజరవనుండటంతో బెన్‌స్టోక్స్ రెండో టెస్టుకి దూరమయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -