Thursday, March 28, 2024
- Advertisement -

సన్యాసిగా ఎంఎస్ ధోని.. షాక్ లో అభిమానులు!

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గ్రౌండ్ లోకి దిగారంటే తన విశ్వరూపం చూపిస్తారు. బ్యాట్స్ మెన్, సూపర్ కీపర్, సత్తా ఉన్న కెప్టెన్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఎంఎస్ ధోని. ఆయన ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు.. ధోనికి ఉన్న జుట్టు కూడా ఎంతగానో ఆకట్టుకునేది.. ధోనీ స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతూ వచ్చారు. ఆ తర్వాత క్రమంగా ధోనీ హెయిర్ స్టైల్ మారుతూ వచ్చింది.

కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనలో ఎన్నో మార్పులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ ధోని కొత్త అవతారంలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. గుండుతో బుద్ధ స‌న్యాసి అవ‌తారంలో ఉన్న ధోనీ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. ఎప్పుడూ స్పోర్టీ లుక్ తో కనిపించే ధోనీ అకస్మాత్తుగా సన్యాసి వేషంలో కనిపించడమేంటో అర్థంకాక అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. 

అంతే కాదు ఈ లుక్ లో ఏదో వేదాందం వల్లించే పరమ పండితుడిలా కనిపిస్తున్నాడు ధోని. ధోనీ కొత్త అవతారంపై పెద్ద చర్చే జరుగుతోంది. స్టార్ స్పోర్ట్స్ త‌న ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ లుక్ గురించి ఏమ‌నుకుంటున్నారో చెప్పాలి అంటూ.. ఫ్యాన్స్‌కు సవాల్ విసిరింది. కాగా, దీనిపై రక రకాలుగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -