Saturday, May 4, 2024
- Advertisement -

స్వల్ప ఘర్షణల మినహా.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్!

- Advertisement -

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా, పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో బారులు తీరారు.

అయితే క్యూలైన్లతో బారులు తీరిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి నేడు పోలింగ్ జరగ్గా… అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. ఇదిలా ఉంటే.. మహబూబాబాద్ జిల్లాలో సీపీఐ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డబ్బులు పంచుతున్నారనే అనే సమాచారంతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ నాయకులు ఇటుకలతో దాడికి దిగారు. దాంతో ఆయనకు గాయాలు అయ్యాయి.. వెంటనే ప్రేమేందర్ రెడ్డిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సన్యాసిగా ఎంఎస్ ధోని.. షాక్ లో అభిమానులు!

పవన్ కళ్యాన్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

స్వల్పంగా పెరిగిన బంగారం ధర!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -