Thursday, May 16, 2024
- Advertisement -

గేల్ వీరవిహారం…54 బంతుల్లో 122 పరుగులు

- Advertisement -

టీ20 స్పెషలిస్ట్‌, యూనివర్శల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరో సారి మెరుపులు మెరిపించాడు. విదేశీ లీగ్‌ల్లో భాగంగా గ్లోబల్‌ టీ20 కెనడాలో వాన్‌కూవర్‌ నైట్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో కేవలం 54 బంతుల్లో 122 పరుగులు సాధించాడు. ఇందులో 12 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. మాంట్రియల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, ఆకాశమే హద్దుగా గేల్ సాగిపోయాడు.

తొలి వికెట్‌కు విస్సే(51)తో కలిసి 63 పరుగులు జత చేసిన గేల్‌.. చెడ్విక్‌ వాల్టన్‌తో కలిసి మరో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో వాంకోవర్ జట్టు 20 ఓవర్లలో 276 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. టీ-20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గత సంవత్సరం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్థాన్ జట్టు 278 పరుగులు చేయగా, అదే ప్రస్తుతానికి క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు. గేల్ గర్జించిన తర్వాత ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఫలితం తేలకుండానె మ్యాచ్ ముగిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -