Saturday, May 4, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మకి ఇదంతా అవసరమా??

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరో గా శుక్రవారం విడుదల అయినా చిత్రం డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయి లో విజయం సాధించడం లో విఫలం అయింది అని చెప్పుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అమెరికా లో అనుకున్నంత కలెక్షన్ కన్నా తక్కువ వచ్చింది అని చెప్పచ్చు. విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ కి మార్కెట్ కి సినిమా ఉన్న తీరు కి అస్సలు సంబంధమే లేదు.

అయితే సినిమా యూనిట్ తమ ప్రయత్నం ప్రకారం ప్రమోషన్స్ చేస్తుంటే మధ్యలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనవసరం గా దేవరకొండ అభిమానులని గెలుకుతున్నారు. ఆయన సైలెంట్ గా ఉండకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కంపేర్ చేస్తూ ఆయన స్టైల్ లో కామ్రేడ్ సరిగ్గా ఆడటం లేదు అని పరోక్షం గా పోస్ట్ చేయడం వివాదానికి దారి తీస్తుంది. ఇక దేవరకొండ అభిమానులు కూడా ఊరుకోకుండా రామ్ గోపాల్ వర్మ ని ఇష్టం వచ్చినట్లు తిట్టి పడేస్తున్నారు.

ఇకనైనా కొంచెం రామ్ గోపాల్ వర్మ తన పైత్యాన్ని తగ్గించుకుంటే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -