Sunday, May 4, 2025
- Advertisement -

అలా అడటం నేను ద్రవిడ్ దగ్గర నుంచే నేర్చుకున్నా.. : హార్దిక్ పాండ్య

- Advertisement -

భారత్ జట్టు‌లో హార్దిక్‌ పాండ్యకు మంచి గుర్తింపు ఉంది. అతడు ఫించ్ హిట్టర్‌గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. జట్టుకు కావాల్సినట్టుగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి ఆట ఆడగలనుడ్. అంతే కాకుండా ఓవర్ల వ్యవధిలోనే భారీ సిక్సర్లతో అమాంతం స్కోరుని పెంచేయడం ఇతడి స్టైల్.

నాలుగు నెలల వ్యవధిలో అన్ని ఫార్మాట్లలో కలిపి నాలుగు సార్లు హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన హార్దిక్ పాండ్య.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ గతి తప్పిన బంతుల్ని స్టాండ్స్‌లోకి తరలిస్తూ తన జోరుని కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ సమయం.. స్కోర్ ని బట్టి ఆడటం రాహూల్ ద్రవిడ్ దగ్గర నుంచే నేర్చుకున్ననని ఈ యంగ్ క్రికెటర్ తెలిపాడు. “మ్యాచ్లో నాకు ఎలాంటి లక్ష్యాలంటూ ఉండవు. రికార్డులను సాధించాలని అసలు బ్యాట్ పట్టుకోను. మ్యాచ్‌ గమనానికి తగినట్లుగా హిట్టింగ్ చేస్తుంటాను తప్ప.. ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి తరలించాలని అసలు అనుకోను. ఒకసారి భారత్-ఎ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ చర్చిస్తుండగా న్యాచురల్ గేమ్ గురించి చర్చ వచ్చింది.

ఒకవేళ ఆరు బంతుల్లో 45 పరుగులు చేయాల్సి వస్తే.. క్రీజులోకి వెళ్లి తొలి బంతినే గాల్లోకి కొట్టేయడం న్యాచురల్ గేమ్ కాదని.. జట్టు అవసరానికి తగినట్లు ఆడటమే న్యాచురల్ గేమ్ అని అప్పట్లో ఆయన చెప్పారు. ఎలాంటి స్థితిలో అయినా సహజసిద్ధమైన ఆట క్రికెటర్‌కి బలం చేకూర్చాలిగానీ.. బలహీనత అవ్వకుడదని ద్రవిడ్ తెలిపారని” హార్దిక్ పాండ్య తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -