Saturday, April 27, 2024
- Advertisement -

టీమిండియా హెడ్‌ కోచ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

- Advertisement -

ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ రిజైన చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ద్రావిడ్ సైతం కోచ్‌గా కొనసాగేందుకు ఇష్టపడటం లేదని పలు మీడియాల్లో కథనాలు వెలువడగా దీనిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.

హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ పదవీ కాలాన్ని పొడగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ద్రవిడ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగించినట్టు వెల్లడించింది. వన్డే ప్రపంచ కప్ 2023తో ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ కాంట్రాక్టు పొడిగిస్తూ బీసీసీఐ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎంతకాలం పొడిగించారనే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయలేదు.

ఈ సందర్భంగా ద్రావిడ్ సేవలను బీసీసీఐ ప్రశంసించింది. టీమిండియా క్రికెట్ జట్టును అద్భుతంగా తీర్చిదిద్దడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారని లక్ష్మణ్ కూడా బాగా పనిచేశారని కితాబిచ్చింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్‌ను మించిన వారు లేరని తెలిపింది. టీమిండియా విజయాల్లో రాహుల్ ద్రవిడ్ మూలస్తంభంలా నిలిచారని …అతడి వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి టీమిండియా విజయాలే నిదర్శనమని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -