Friday, May 9, 2025
- Advertisement -

చచ్చి బ్ర‌తికిని భారత్ …వెస్టిండీస్‌తో రెండో వ‌న్డే టై !

- Advertisement -

భారత్, వెస్టిండీస్ మధ్య విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగి టైగా ముగిసింది.నరాలు తెగే ఉత్కంఠ క‌ల్గించే మ్యాచ్ చాలారోజులు త‌రువాత జ‌ర‌గ‌డంతో అభిమానులు ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్ మెన్స్ మరోసారి అధ్భుతంగా బ్యాటింగ్ చేశారు.భారత్ కేవలం ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 321 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ సాధించాడు. మొత్తంగా కోహ్లీ 157 పరుగులను కేవలం 129 బంతుల్లోనే సాధించి నాటౌట్ గా నిలిచాడు.ప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ సాధించాడు. మొత్తంగా కోహ్లీ 157 పరుగులను కేవలం 129 బంతుల్లోనే సాధించి నాటౌట్ గా నిలిచాడు.ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు తొందరగానే ఔటైనా కోహ్లీ, రాయుడు జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ మొదట ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థ శతకాలు నమోదు చేసుకున్నారు.

అనంతరం రాయుడు 73 పరగుల వద్ద ఔటవడంతో ఈ బాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన ధోనీ, రిషబ్ పంత్, జడేజా లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ జోరు మాత్రం తగ్గలేదు. మొత్తంగా కోహ్లీ చెలరేగి సెంచరీ సాధించి చివరివరకు నిలవడంతో విండీస్‌కు భారత్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.ఆ తర్వాత బ్యాటింగ్‌ దిగిన విండీస్‌ జట్టు దాటిగా ఆడింది. 78 పరుగులకే మూడు వికెట్లు కొల్పోయిన విండీస్‌.. ఆ తర్వాత వేగం పెంచింది. హెట్‌మైర్‌(94), హోప్‌(123 నాటౌట్‌) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. హెట్‌మైర్‌ జౌటైన తర్వాత విండీస్‌ వికెట్లు కొల్పోయినప్పటికీ.. సెంచరీ సాధించిన హోప్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. అఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హోప్‌ ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -