Saturday, May 10, 2025
- Advertisement -

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన ఐసీసీ..

- Advertisement -

వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే మ‌హిళ‌ల‌, పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మ‌హిళ‌ల‌,పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ మెగా టోర్నీల‌కు ఆస్ట్రేలియా ఆథిద్య‌మివ్వ‌నుంది. మ‌హిళ‌ల వరల్డ్‌కప్ ఫిబ్రవరి, మార్చిలలో జరగనుండగా.. పురుషుల వరల్డ్‌కప్ అక్టోబర్, నవంబర్‌లలో జరగనుంది.ఇరు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం మెల్‌బోర్న్‌ మైదానం వేదిక కానుంది. మహిళా టోర్నీల్లో 10 జట్లు పోటీపడనుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి.

ఇండియన్ టీమ్ గ్రూప్ 2లో ఉంది. ఇందులో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫయర్ టీమ్స్ ఉంటాయి. ఆతిథ్య జట్టు, ఢిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా- భారత్‌ల మ్యాచ్‌తో మహిళల టోర్నీ ఆరంభం కానుండగా.. పురుషుల టోర్నీకి ఆసీస్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌తో తెరలేవనుంది.

ఈ టోర్నీల్లో హర్మన్‌ సేన ప్రారంభ మ్యాచ్‌నే ఆడనుండగా.. కోహ్లిసేన మాత్రం అక్టోబర్‌ 24న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. ఇండియా తన తొలి మ్యాచ్‌ను సౌతాఫ్రికాతో ఆడనుంది.2020, ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడతాయి. పురుషుల వరల్డ్‌కప్ 2020, అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగుస్తుంది. ముందు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల తర్వాత అక్టోబర్ 24న టాప్ ర్యాంక్ టీమ్ పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది.

మహిళల వరల్డ్‌కప్

గ్రూప్ స్టేజ్ (ఫిబ్రవరి 21 -మార్చి 3)
గ్రూప్ ఎ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, క్వాలిఫయర్1
గ్రూప్ బి: ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2
సెమీఫైనల్స్: మార్చి 5
ఫైనల్ : మార్చి 8

పురుషుల వరల్డ్‌కప్

క్వాలిఫయర్స్: అక్టోబర్ 18-23
గ్రూప్ స్టేజ్: అక్టోబర్ 24-నవంబర్ 8
గ్రూప్ 1: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్స్
గ్రూప్ 2: ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్స్
సెమీఫైనల్స్: నవంబర్ 11, 12
ఫైనల్: నవంబర్ 15

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -