వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రెండు సూపర్ ఓవర్లు టైగా ముగిసినపుడు రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించింటే బాగుండదనె వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. సూపర్ ఓవర్‌లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో గెలుపును నిర్ణయించడం సరికాదని పలువురు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎట్టకేలకు ఐసీసీ దిగివచ్చింది. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ.. బౌండరీలను లెక్కించే నిబంధనను తదుపరి సమావేశంలో సమీక్షించనుందని ఐసీసీ ఆదివారం తెలిపింది. సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరగుతుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు. ‘మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్‌తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. టై అయిన సందర్భంలో భవిష్యత్తులో టైటిల్‌ను ఇరు జట్లకు పంచాలన్న విషయంపై ఐసీసీ వార్షిక సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. టెస్ట్ చాంపియన్‌షిప్‌ను స్వాగతిస్తున్నామన్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -
విమర్శలతో దిగివచ్చిన ఐసీసీ….? బౌండరీ లైన్ సమీక్షపై కుంబ్లే నేతృత్వంలో కమిటీ వేసిన ఐసీసీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -