Thursday, May 2, 2024
- Advertisement -

కోహ్లి గ్రేట్‌నెస్‌.. వీడియో షేర్ చేసిన ఐసీసీ

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీడా స్ఫూర్తి ప్ర‌ద‌ర్శించాడు. కేవ‌లం ఆట వ‌రకే ప్ర‌త్య‌ర్థులంగానీ క్రికెట‌ర్లంతా ఒక‌టేన‌ని నిరూపించాడు. అస‌లు సంగ‌తి ఏంటంటే… శుక్ర‌వారం టీమిండియా- ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప‌ర్యాట‌క జ‌ట్టు కెప్టెన్ జో రూట్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యాడు. ఈ క్ర‌మంలో 86వ ఓవ‌ర్ ముగిసే స‌మ‌యానికి కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో, జో రూట్ విల‌విల్లాడాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్ వ‌ద్ద‌కు వ‌చ్చిన కోహ్లి, ఫిజియో అవ‌తారం ఎత్తి మ‌సాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో కోహ్లిపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సూప‌ర్ కోహ్లి… హ్యాట్సాఫ్.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలిరోజు ఆట ముగిసే స‌మ‌యానికి ప‌ర్యాట‌క‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 263 ర‌న్్స‌ స్కోరు చేసింది. జో రూట్ సెంచ‌రీ చేయ‌గా, ఓపెన‌ర్ సిబ్లీ శ‌త‌కానికి 13 ప‌రుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక భార‌త జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. అశ్విన్ 1, బుమ్రా రెండు వికెట్లు త‌మ ఖాతాలో వేసుకున్నారు.

పాపం.. దురదృష్టం అంటే నీదే కుల్దీప్‌!

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

హాట్ హాట్ గా ‘పిట్ట కథలు’ ట్రైలర్ అలరిస్తోంది..!

డైరెక్టర్ గా మారబోతున్న కెమెరామెన్ విద్యాసాగర్…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -