Saturday, April 20, 2024
- Advertisement -

T20 World Cup 2022 : టీం 20 ప్రపంచ కప్ షెడ్యూల్

- Advertisement -

ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు శుభవార్త. టీం 20 ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్ లు జరుగుతాయి. ఈ యేడాది టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏడు వేదికలలో 45 మ్యాచులు ఆడతారు. నవంబర్ 13న మెల్ బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

మొత్తం 8 జట్లను రెండు గ్రూపులు గా విభజించారు. ఈ ఏడాది గ్రూప్ 2 లో సూపర్ 12లో భారత్ మ్యాచ్ లు ఆడునుంది. అదే గ్రూపులో బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు కూడా ఉన్నాయి. గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఉన్నాయి.

ఈ సారి టోర్నీలో విషేశం ఏమిటంటే గతేడాది లాగే భారత్ తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది. అక్టోబర్ 23న మెల్ బోర్న్ లో మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ కప్ చరిత్రలో ఎన్నడూ భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. కానీ గతేడాది ఓడిన టీం ఇండియా ఇంటిదారి పట్టింది. ఈ సారి ఎలాగైనా పాకిస్తాన్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అదేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -