ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అదేనా..?

- Advertisement -

దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాల్లో థియేటర్లపై పరిమితులు , ఆంక్షలు విధించారు. దీంతో చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి . పాన్ ఇండియా స్థాయితో తెరకెక్కిన సినిమాల రిలీజ్ డేట్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఆర్ సినిమా సైతం వాయిదా పడింది. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటిస్తామని సినిమా యూనిట్ తెలిపింది. కాగా సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

కాగా మార్చి తర్వాత కరోనా తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో RRR చిత్రం ఏప్రిల్ నెల 30వ తేదీన లేదా మే మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ ప్రయత్నిస్తున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు దర్శక,నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి.

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ కోసం ప్రంపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌‌ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈలోపు వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్లను నిర్వహించారు.

Also Read: చిరంజీవికే నో చెప్పింది.. మహేష్ బాబు పరిస్థితి ఏమిటో మరి..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -