కాఫీ విత్ కరణ కార్యక్రమంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురి అయికన రాహుల్ ఎట్టకేలకు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ క్రికెట్ లో తిరిగి అడుగుపెట్టి… కంగారూ జట్టుపై రెండు మ్యాచ్ లలో 47, 50 పరుగులు చేశాడు. ఆసిస్‌తో జరిగిన టీ20 రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నారు. దీంతో కెఎల్ రాహుల్ ఐసీసీ ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకిగ్స్‌లలో నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. టీ20 టాప్ 10 బ్యాట్స్ మెన్ లో భారత్ తరఫున రాహుల్ ఒక్కడే స్థానం సాధించాడు. ఐర్లాండ్ ను అదరగొట్టిన ఆప్ఘనిస్థాన్ కి చెందిన హజరతుల్లాహ్ జజాయీ 31 స్థానాలు జంప్ చేసి మొదటిసారి టాప్ 10లోకి వచ్చాడు. పాకిస్థాన్ కి చెందిన బాబర్ ఆజమ్, న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మన్రో, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రాషిద్ ఖాన్ బౌలర్ల ర్యాంకుల్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో తన అద్భుత ప్రదర్శనతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఐర్లాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రాషిద్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ కి చెందిన షాదాబ్ ఖాన్ రెండో స్థానానికి చేరాడు.
- Advertisement -
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో కేఎల్ రాహుల్ ఎ న్నో స్థానమో తెలుసా…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -