ప్రంపచకప్‌లో పాకిస్థాన్ తన ఆటను చెత్తగా ప్రారంభించింది. విండీస్ బౌలర్ల ధాటికి 105 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు గురైంది. ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకొనే ప్రయత్నం చేయలేదు.కనీసం సగం ఓవైర్లెనా బ్యాటింగ్ చేయలేక 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది.
వెస్టిండీస్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కొనలేక పాక్ టాప్ ఆర్డర్ పెవిలియన్ బాట పట్టారు.కనీసం క్రీజులో కుదురుకొని రెండంకెల స్కోరైనా చేయడానికి సాహసించలేదు. మ్యాచ్‌లో బౌలర్ల హవానే కొనసాగింది. ప్రతీ ఓవర్లోనూ తెలివైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు. రస్సెల్, కాట్రెల్, హోల్డర్, థామస్ ధాటికి పాక్ టాపార్డర్ మొత్తం పెవిలియన్ చేరింది.ఒషానే థామస్(4),జాసన్ హోల్డర్(3), ఆండ్రీ రస్సెల్(2) గొప్పగా బౌలింగ్ చేసి పాక్‌ను కుప్పకూల్చారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తన ఆటను పేవలంగా ప్రారంభించింది. . ఫకార్ జమాన్(22), బాబర్ అజామ్(22), మహ్మద్ హఫీజ్(16), వాహబ్ రియాజ్(18) మినహా ఏ ఒక్కరు డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. మిడిలార్డర్ పోరాట పటిమతో ఆడాల్సిన స్థితిలో చేతులెత్తేసి ఎప్పుడెప్పుడు పెవిలియన్ చేరుదామా అన్న తరహాలో ఆ జట్టు ఇన్నింగ్స్ సాగింది. ఆఖర్లో హోల్డర్ బౌలింగ్‌లో రియాజ్ రెండు సిక్సర్లు.. ఒక ఫోర్ బాది 17 పరుగులు రాబట్టాడు. ఇమామ్ ఉల్ హక్(2), హారీస్ సొహైల్(8), సర్ఫరాజ్ అహ్మద్(8), మహ్మద్ హఫీజ్(16) అందరూ విఫలమయ్యారు. విండీస్ బ్యాట్స్‌మన్ ఓవర్‌కు రెండు పరుగులు సాధిస్తే అలవోకగా విజయం సాధిస్తుంది.