Thursday, May 2, 2024
- Advertisement -

వందేళ్ల నాటి కార్లో భార‌త్య‌తో క‌ల‌సి లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌చిన్…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌ కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండడంతో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా కుటుంబంతో స‌ర‌దీగా గ‌డిపేస్తున్నారు. స‌చిన్‌కు కార్లంటే విప‌రీత‌మైన మోజు అన్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే స‌చిన్ ద‌గ్గ‌ర చాలా కార్లు ఉన్నాయి. ఐసీసీ వరల్డ్‌కప్-2019‌లో భాగంగా యూకేలో ఉన్న సచిన్.. లండన్‌లోని రాయల్ ఆటో మొబైల్ క్లబ్‌(RAC)కు చెందిన పాల్ మాల్ క్లబ్‌హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సచిన్‌ 119 ఏళ్ల నాటి విక్టోరియన్ కారు ఆక‌ట్టుకుంది.

దాంతో అక్కడివారిని అడిగి దాన్ని ఎలా డ్రయివ్ చేయాలో ఆకళింపు చేసుకున్నాడు. ఆపై, తన అర్ధాంగి అంజలితో కలిసి ఆ కారును నడుపుకుంటూ లండన్ వీధుల్లో విహరించాడు. ఆ వింటేజ్ కారును స్వయంగా నడుపుతూ సెయింట్ జేమ్స్ వీధిలోకి రాగానే మీడియా కంటబడ్డాడు. ఈ వీడియోను ‘ఆటోకార్ ఇండియా’ ఎడిటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. సచిన్‌కు పురాతన కార్లంటే చాలా ఇష్టం. ముంబయిలో వింటేజ్ కార్ల ప్రదర్శనలో ఆయన నిత్యం పాల్గొంటారు.

https://www.instagram.com/p/BzNR1ufAM7C/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -