- Advertisement -

శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఒకే క‌టుంబానికి చెందిన ఐదుగురు దుర్మ‌ర‌ణం

- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ సమీపంలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్క‌డి కక్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. లారీ-ఇనోవా కారు ఢీకొన్న.. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

వివ‌రాల్లోకి వెల్తే….వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పోలీస్‌ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గ ప్రసాద్ అతని కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. దైవ ద‌ర్శ‌నం అనంత‌రం తిరుగు ప్ర‌యానంలో హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా అమన్‌గల్ మండలం మెడిగడ్డ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్ కాంట కోసం లారీ టర్న్ అవుతుండగా వారు ప్రయాణిస్తున్న ఇనోవా కారు బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన కుమారుడు శాంతన్, బావ రాజు, మరొకరు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ భార్య విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -