Thursday, May 16, 2024
- Advertisement -

పెటాకుల‌యిన ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి..

- Advertisement -

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు సంసారయోగం లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న ఆయనకు… ఈ పెళ్లి కూడా అచ్చి రానట్టే ఉంది. ఇమ్రాన్‌తో వేగలేక ఆయన మూడో భార్య బుష్రా మనేకా ఇప్పటికే పుట్టింటికి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి బుష్రా మనేకా కొడుకే కారణమని తెలిపింది.

ఇమ్రాన్ తన ఆధ్యాత్మిక సలహాదారు బుష్రా మనేకాను ఫిబ్రవరి 18న రహస్యంగా వివాహం చేసుకున్నాడు. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో చాలా నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. మనేకా కొడుకు తమతో పాటు ఉండటం ఇమ్రాన్ కు ఇష్టం లేదట. మరోవైపు, ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కలు మనేకాకు నచ్చలేదట. దీంతో, ఎవరిదారి వారు చూసుకున్నారని పాక్ మీడియా కథనం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -