Friday, May 9, 2025
- Advertisement -

రెండో టీ20కి వ‌ర‌ణుడి అంత‌రాయం..భార‌త్ టార్గెట్ 137

- Advertisement -

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల జోరుముందు బ్యాట్స్‌మెన్ క్యూ కట్టడంతో కంగరూ టీమ్ శుభారంభం చేయలేకపోయింది. ఫించ్,షార్ట్,క్రిస్ లిన్, మాక్స్‌వెల్, స్టోయినిస్ విఫలమవ్వడంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెన్ మెక్‌డోర్మెట్, ఆండ్రూ టై ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా పోటీలో నిలిచింది.

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంకో ఓవర్ వేస్తే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగుస్తుందనగా వర్షం వచ్చింది. వర్షం వల్ల దాదాపు గంటకు పైగా సమయం వృథాకావడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అంపైర్లు లక్ష్యాన్ని 19 ఓవర్లలో 137 పరుగులుగా సవరించారు.

పేసర్లు భువనేశ్వర్‌కుమార్(2/20), ఖలీల్ అహ్మద్(2/39) విజృంభించడంతో 19 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్లకు 132 పరుగులు చేసింది. బెన్ మెక్‌డెర్మాట్(32నాటౌట్) టాప్ స్కోరర్. టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డున్న క్రిస్‌లిన్, మాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -