- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శ‌ర్మ‌….

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ లో రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఫామ్‌తో దూసుకుపోతున్నారు. బంగ్లాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శతకం బాదిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ (104: 92 బంతుల్లో 7×4, 5×6) అరుదైన రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తాజా ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది నాలుగో శతకంకాగా.. వన్డే కెరీర్‌లో 26వ సెంచరీ.

ఇంగ్లాండ్ గడ్డపై భారీ స్కోర్లు సాధిస్తూ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మెరుపు శతకం సాధించాడు. ప్రపంచకప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో శ్రీలంకకి చెందిన కుమార సంగక్కర 4 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా రోహిత్ శర్మ అతని సరసన నిలిచాడు.

ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో స‌చిన్ 6 శ‌త‌కాల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా తర్వాత రికీ పాంటింగ్ (5 సెంచరీలు), కుమార్ సంగక్కర (5), రోహిత్ శర్మ (5) టాప్‌-4లో కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -