Saturday, May 3, 2025
- Advertisement -

టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన..సిరీస్ కైవసం

- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మరో మ్యాచ్ మిగిలిఉండగానే విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ సేన. భారత్ విధించిన 182 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ హాఫ్ 26 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 39 పరుగులు, ఫిల్ సాల్ట్ 23 రన్స్ చేశారు. ఓ దశలో ఇంగ్లాండ్‌ విజయం అంతా ఖాయమనుకున్నారు.

కానీ 15వ ఓవర్ లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు వరుణ్ చక్రవర్తి. 2 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు,రవి బిష్ణోయ్ కూడా 3 వికెట్లతో రాణించడంతో భారత్ విజయం ఖాయమైంది.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడ్డ భారత్‌ను హార్దిక్ పాండ్యా (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీలతో ఆదుకున్నారు. దీంతో బారత్ భారీ స్కోరు సాధించగా 3-1 తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -