పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ విభాగంలో భారత హాకీ జట్టు ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది భారత్. సెమీ ఫైనల్ పోరులో 3-2 తేడాతో భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ 54వ నిమిషంలో గొంజాలో సహకారంతో జర్మనీ ఆటగాడు మార్కో మిల్ట్‌కౌ చేసి గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ తర్వాత భారత జట్టు మరో గోల్ చేయకుండా మలేషియా ఆటగాళ్లు సక్సెస్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. స్వర్ణ పతకం గెలవాలనుకున్న భారత కలలు కల్లలుగానే మిగిలినా కాంస్యం పతకం కోసం పోటీ పడే అవకాశం ఉంది.
అయితే మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో టైటిల్ ఖారరైంది. రెజ్లింగ్ విభాగంలో సెమీస్‌లో క్యూబా క్రీడాకారిణి గుజ్‌మాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది వినేశ్ ఫోగట్. 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో 5-0 తేడాతో బౌట్ గెలిచింది. దీంతో స్వర్ణ పతకం కోసం ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్‌తో తలపడనుంది ఫోగట్.
ఇక రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది ఫోగట్. తొలి పిరియడ్ ముగిసే సమయానికి ఫోగట్ 1-0తో ఆధిక్యంలో నిలిచిన ఫోగట్… రెండో పీరియడ్‌లో ఆమె 5-0తో భారీ ఆధిక్యాన్ని సాధించింది.