ఇప్పటికె వన్డేసిరీస్‌ను కౌవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. మొదటి టీ20లో న్యూజిలాండ్‌పై అద్భుతంగా గెలిచిన భారత్‌కున్న చెత్త రికార్డుకు తెరదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దిల్లీలో జరిగిన తొలి టీ20లో 53 పరుగుల తేడాతో గెలిచింది. రాజ్‌కోట్‌లో శనివారం నిర్వహించే రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. ఫిరోజ్‌షా కోట్లాలో అన్ని విభాగాల్లో మూకుమ్మడిగా విఫలమైన కివీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి తీరాలన్న కసితో ఉంది. 1-1తో సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది.
తొలిపోరులో గెలిచిన టీమిండియాపై అంతగా ఒత్తిడి లేదు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడే అవకాశముంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. దిల్లీలో ఇద్దరూ తలో 80 పరుగులు చేసి 158 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇప్పుడు రెండో టీ 20లో కూడా విజయం సాధించి స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భారత్‌పై మెరుగైన రికార్డున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, గ్రాండ్‌హోమ్ టీ20లో తేలిపోయారు. గత మ్యాచ్ లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో దాన్ని అధిగమించే పనిలో పడింది. ఫీల్డింగ్ సైతం దారుణంగా కనిపించింది. శిఖర్, రోహిత్ క్యాచ్‌లను వదిలేయడంతో ఆ తర్వాత వారు విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది.
ఇప్పటివరకూ ఈ స్టేడియంలో కేవలం ఒక అంతర్జాతీయ టీ 20 మాత్రమే జరిగింది. 2013లో ఆసీస్ తో జరిగిన టీ 20 లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలుకావడం గమనార్హం. వన్డే ఫార్మాట్ లో ఇంగ్లండ్ (2013), దక్షిణాఫ్రికా(2015)లతో ఈ స్టేడియం వేదికగా తలపడిన రెండు సార్లు టీమిండియా ఓటమి చెందింది. మరి రెండో వన్డేలో గెలిచి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండానె సిరీస్‌ను గెలుచుకుంటుందాలేదా మరో సారి రసవత్తరపోరుకు దారితీస్తుందో చూడాలి.
జట్లు వివరాలు…
భారత్: విరాట్ కోహ్లీ (సారథి), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (సారథి), ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లేథమ్, హెన్రీ నికోల్స్, ఆడమ్ మిల్నే, కొలిన్ మన్రో, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ