ఫిరోజ్‌షా కోట్లమైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నీంగ్స్‌లో ఆదిలోనే భారత్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విజయ్ 9 లక్మల్ బౌలింగ్‌లో డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ధావన్ 2, రహానే1 ఉన్నారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఉదయం నాలుగో రోజు ఆట ప్రారంభమైన తరువాత 23 నిమిషాల్లోనే లంక కథ ముగిసింది. లంక ఆటగాడు చండీమల్ అద్భుత రీతిలో రాణించి 164 పరుగులు చేశాడు. నిన్న 9 వికెట్లు కోల్పోయిన లంక ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన తరువాత, 136వ ఓవర్ లో ఇషాంత్ శర్మ వేసిన మూడో బంతిని చండీమల్ షాట్ కొట్టగా, లాంగ్ ఆన్ లో ఉన్న శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంతో లాంఛనం ముగిసింది. ప్రస్తుతం భారత జట్టు 163 పరుగుల లీడ్ లో ఉంది. భారత్ ఆట ముగిసే సమయానికి 24/1తో ఉంది. శిఖర్ ధావన్ 6, అజింక్య రహానె 9 క్రీజులో ఉన్నారు.