భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆసిస్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(104: 113 బంతుల్లో 11ఫోర్లు, సిక్స్), అరోన్ ఫించ్(93: 99 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) విజృంభించడంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 313 పరుగులు చేసింది. తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీని విడగొట్టడానికి భారత్ బౌలర్లు నానా పాట్లు పడ్డారు. ఎట్లకేలకు కుల్దీప్ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. తకానికి చేరువగా వచ్చిన ఫించ్..32వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా వన్డేల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే వీరిద్దరూ జట్టును పటిష్ఠస్థితిలో నిలిపారు. ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఓవర్లలో మాక్స్‌వెల్ (47: 31 బంతుల్లో 3×4, 3×6), స్టాయినిస్ (31: 26 బంతుల్లో 4×4) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ వికెట్ తీశాడు.
- Advertisement -
ఖవాజా సెంచరీ..భారీ స్కోరు చేసిన ఆసిస్…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -