Saturday, May 18, 2024
- Advertisement -

వార్రెవ్వా షాట్… స‌చిన్‌ను త‌ల‌పించిన కోహ్లీ…..

- Advertisement -

జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (39 బంతుల్లో 72; 2×6, 10×4) వీర విహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. అంతకు ముందు షంసీ ఓవర్లో కోహ్లికి లైఫ్ వచ్చింది. షంసీ విసిరిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతికి కోహ్లి భారీ షాట్ ఆడాడు. కానీ అది కాస్తా బౌండరీ లైన్ దగ్గరున్న ఫీల్డర్ బెహర్డీన్ చేతిలో పడింది. సులువైన క్యాచ్‌ అయినప్పటికీ అతడు వదిలేశాడు. లైఫ్ రావడంతో బతికిపోయిన కోహ్లి.. ఆ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ సహా 13 పరుగులు రాబట్టాడు.

అయితే అదే ఓవర్లో విరాట్ ఆడిన సిక్సర్ మాస్టర్‌ను తలపించింది. షంసీ విసిరిన లాఫ్టెడ్ డెలివరీని ఆడట కోసం క్రీజ్ వదిలి ముందుకు వచ్చిన కోహ్లి.. చక్కటి టైమింగ్‌తో స్ట్రయిట్‌గా సిక్స్ కొట్టాడు. అద్భుతమైన టైమింగ్ కోహ్లి ఆడిన ఆ షాట్ సచిన్‌ను గుర్తుకు తెచ్చింది.

టెండుల్కర్ బుక్‌లోని షాట్‌ను కోహ్లి ఆడాడంటూ అభిమానులు ట్వీట్లు చేశారు. కానీ తర్వాతి ఓవర్లోనే షంసీ కోహ్లిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -