Saturday, May 18, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

- Advertisement -

కేప్‌టౌన్‌లో మరికాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ల మధ్య మూడో వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు జరిగిన విషయం తెలిసిందే. మొదటి రెండు వన్డేల్లో ఓడిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలోనయినా గెలిచి పరువు కాపాడుకోవాలని కసిగా ఉంది. మరో వైపు టీమిండియా ఈ వన్డేలోనూ రాణించి తమ దూకుడును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. టెస్టు సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా వన్డేల్లో మాత్రం భారత్‌తో రాణించలేకపోతోంది.

తొలి రెండు మ్యాచుల్లో చేజింగ్ చేసి గెలవడంతో.. ఈసారి సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం. గాయాల బెడదతో సతమతమవుతున్న సౌతాఫ్రికా.. ముగ్గురు టాప్ బ్యాట్స్‌మెన్ లేకుండా ఊపు మీదున్న భారత బౌలర్లను ఎదుర్కొని ఎలా చేజ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -