- Advertisement -
ఢిల్లీలో జరుగుతోన్న భారత్, శ్రీలంక మూడో టెస్టు మ్యాచు డ్రాగా ముగిసింది. మూడు టెస్టు సిరీస్‌లో మొదటి, మూడో టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టును టీమిండియా గెలుచుకుంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 536, రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 373, రెండో ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసింది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా వరుసగా 9 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుని, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డుని సమం చేసింది.