Monday, May 12, 2025
- Advertisement -

వ‌న్డేల‌ కంటే ముందుగానే విండీస్‌కు మ‌రో ఎదురు దెబ్బ‌..

- Advertisement -

భారత్‌తో వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందే పర్యాటక వెస్టిండీస్ జట్టుకి వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే క్రమశిక్షణ తప్పిన ఆ జట్టు కోచ్‌పై ఐసీసీ రెండు వన్డేల సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా ఓపెనర్ ఎవిన్ లావిస్ వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది.

ఇప్ప‌టికే జ‌ట్టునుంచి క్రిస్‌గేల్, ఆండ్రీ రసెల్‌, డ్వేన్ బ్రావో తదితర హిట్లర్ల లేకపోవడంతో ఇప్పటికే బలహీనంగా కనిపిస్తున్న వెస్టిండీస్ వన్డే జట్టు.. తాజాగా ఎవిన్ లావిస్ కూడా దూరమవడంతో మరింత పేలవంగా మారింది. వన్డే సిరీస్‌కి ఎవిన్ లావిస్ స్థానంలో కీరన్ పోవెల్‌ని వన్డే జట్టులోకి వెస్టిండీస్ ఎంపిక చేసింది. ఇప్ప‌టికే టెస్ట్‌ను క్లీన్ స్విప్ చేసిన భార‌త్ అదే ఆత్మ‌విశ్వాసంతో వ‌న్డేల‌కు సిద్ద‌మ‌వుతోంది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన ఎవిన్ లావిస్‌కి భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. జూలై 9, 2017న భారత్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లోనే 6×4, 12×6 సాయంతో ఏకంగా 125 పరుగులతో ఎవిన్ లావిస్ అజేయంగా నిలిచాడు.ఈనెల 21 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు వన్డేల సిరీస్‌ మొదలుకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -