ప్రపంచకప్ తర్వాత కోహ్లీ, రోహిత్ మధ్య విబేధావ్యవహారం ఒక్క సారిగా ప్రకంపనలు రేపింది. ఇద్దరి మధ్య విబేధాలు లేవని చెప్పినా లోపల మాత్రం విబేధాలు మాత్రం కొన్ని సమయాల్లో బయటపడుతున్నాయి. ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ కు విండీస్ తో జరిగిే టెస్ట్ సిరీస్ లో అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. కాని కోహ్లీ మాత్రం రోహిత్ కు హ్యాండ్ ఇచ్చి అనుమ విహారీని తీసుకున్నారు.
తాజాగా టెస్టుల్లో రోహిత్ ను తీసుకోకపోవడంపై కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకి బదులుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని టీమ్‌లోకి తీసుకున్న కోహ్లీ.. మెరుగైన టీమ్ కాంబినేషన్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
హనుమ విహారి ప్రతిభావంతమైన పార్ట్ టైమ్ బౌలర్. టీమ్ ఓవర్ రేట్ పెరుగుతున్న సమయంలో అతను ఉపయోగపడతాడని జట్టులోకి తీసుకున్నాం. తుది జట్టు ఎంపికకి ముందు అందరితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే హనుమ విహారీని తీసుకున్నామన్నారు. జట్టు ఎంపికపై ఎప్పుడూ ఈ భిన్నాభిప్రాయాలు ఉంటాయని…ఏది ఏమైనా జట్టు ప్రయోజనాలు, టీమ్ కాంబినేషనే మాకు ముఖ్యం’ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.