Monday, May 12, 2025
- Advertisement -

ఆ ఒక్క స‌మ‌స్య‌తోనే విదేశాల్లో టెస్టుల్లో రాణించ‌లేక‌పోతున్నాం…కోహ్లీ

- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాలో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో విరాట్ సేన 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవశం చేసుకుంది. అనంత‌రం బౌల‌ర్ల‌పై కోహ్లీ ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించారు. అయితే విదేశాల్లో టెస్టుల్లో రాణించ‌క‌పోవ‌డంపై కెప్టెన్ స్పందించారు.

స్వదేశంలో మంచి విజయాలు సాధిస్తున్నప్పటికి విదేశీ పర్యటనల్లో విఫలం కావడానికి బ్యాటింగే కారణమని అన్నారు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బౌలర్లు భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారని…కానీ బ్యాట్ మెన్సే ఆ స్థాయిలో రాణించడంలేదని అన్నారు. దీని వల్ల విదేశాల్లో జరిగే సీరిస్ లను కోల్పోతున్నట్లు కోహ్లీ తెలిపారు.

భారత జట్టు బౌలింగ్ వల్ల ఏ సమస్యా లేదని కానీ బ్యాటింగ్ విభాగమే కాస్త బలహీనంగా ఉందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే సీరిస్ లు కోల్పోడానికి బ్యాటింగే కారణమని అన్నారు. స్వదేశంలో మాత్రం బ్యాట్ మెన్స్ బాగా ఆడుతున్నారు. కానీ విదేశీ సీరిస్‌లలో ఇదే విధంగా పరగులు సాధించలేకపోతున్నారు. ఈ ఒక్క విషయంలో మెరుగుపడితే భారత జట్టుకు తిరుగుండదని అన్నారు. ఇక బౌలర్లు స్వదేశంలో, విదేశాల్లోనూ టెస్టుల్లో 20 వికెట్లు తీయగల్గుతున్నారని కోహ్లీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -