Thursday, May 16, 2024
- Advertisement -

టీ20ల్లో సరికొత్త రికార్డ్…ర‌స్సెల్ సిక్స‌ర్ల‌మోత‌

- Advertisement -

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్‌ 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88 పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. అయితే రసెల్‌ కొట్టిన 10 సిక్సర్లు ఒక ఎత్తయితే, బ్రేవో వేసిన ఓవర్‌లో కొట్టిన ఒక సిక్స్‌ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 17 ఓవర్‌ రెండో బంతికి రసెల్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. అది స్టేడియాన్ని దాటుకుని బయటపడింది. ఈ సీజన్‌లో ఇదే లాంగెస్ట్‌ సిక్స్‌గా నిలవడం మరొక విశేషం.

రస్సెల్ సిక్సర్ల మోత మోగించడంతో ఓ దశలో 89/5తో కష్టాల్లో ఉన్నట్లు కనిపించిన కోల్‌కతా 20 ఓవర్లు ముగిసే సరికి 202/6గా నిలిచింది. ఈ సీజన్లో 200కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. రస్సెల్ 36 బంతుల్లో 88 రన్స్ చేయగా.. అందులో సిక్స్‌ల రూపంలో వచ్చినవే 66 పరుగులు ఉన్నాయి. టీ20ల్లో తక్కువ స్కోరుకే అధిక సంఖ్యలో సిక్సు‌లు బాదిన ఆటగాడిగా రస్సెల్ రికార్డ్ నెలకొల్పాడు.

రస్సెల్ బలంగా బాదిన బంతి మైదానం వెలుపల పడింది. మరో బంతి కప్పు పై భాగాన్ని తాకి తిరిగి వెనక్కి వచ్చింది. దీన్ని బట్టే అతడెంత బలంగా బంతిని బాదాడో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -