Thursday, June 13, 2024
- Advertisement -

శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించిన కంగ‌నా

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్, అమ్మాయిలపై లైంగిక వేధింపుల మీద ఇప్పుడు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందరో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారు.బాలీవుడ్ లో కంగనా రనౌత్ కూడా మీటూ అనే ప్రోగ్రాం న‌డుపుతుంది. హీరోయిన్లపై వేధింపులు తగ్గాలంటూ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా స్పందించింది.కంగనా మాట్లాడుతూ… టాలీవుడ్‌లోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారని, సినీ ఇండస్ట్రీలలో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తాను కూడా అలాంటి ఇబ్బందులు పడ్డానని కంగనా చెప్పింది.

అయితే ఇలాంటి విషయాలపై పోరాడటానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పిన కంగనా, శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి చాలా మార్గాలు ఉన్నాయ‌ని ఇది స‌రైనా మార్గం కాద‌ని కంగానా చెప్పుకొచ్చంది.శ్రీరెడ్డికి త‌న స‌పోర్టు ఉంటుంద‌ని అది కూడా ఆమె స‌రైనా పద్ద‌తిలో త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయాలి.సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటానికి మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -