మహేంద్రసింగ్ ధోనికి ఉన్న ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. మరో సారి ఆఫాలోయింగ్ ఏంటనేది రుజువు అయ్యింది. ఐదు రోజుల్లో ఐపీఎల్-12 సీజన్ ప్రారంభం కానుంది. దీనికోసం ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను సన్నద్దం చేస్తున్నాయి. తొలి మ్యాచ్ టైటిల్ ఫేవరేట్స్ గా భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా చెన్నైలోని తమ సొంత గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో కసరత్తు ప్రారంభించింది. ధోనీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు వస్తున్న వేళ, తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే ప్రాక్టీస్ మ్యాచ్ ని తిలకించేందుకు అభిమానులను అనుమతించడంతో స్టేడియంలోకి దాదాపు 40 వేల మంది ఫ్యాన్స్ వచ్చినట్లు సమాచారం. ధోనీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి వస్తుంటే కరతాళధ్వనులతో “ధోనీ… ధోనీ” అంటూ వేసిన కేకలతో స్టేడియం దద్దరిల్లింది. అభిమానుల ఉత్సాహాన్ని చూసి ధోని ముసిముసిగా నవ్వుతుండగా, తీసిన వీడియోను సీఎస్కే యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
- Advertisement -
ధోని ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -