Saturday, May 3, 2025
- Advertisement -

చెన్నైపై అందుకే గెలిచాం….రోహిత్‌

- Advertisement -

ఐపీఎల్ 2012లోభాగంగా తాజా ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1లో చెన్నై సొంత మైదానంలో ముంబ‌య్ ఇండియ‌న్స్ ఆ జ‌ట్టును మ‌ట్టిక‌రింపించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రోహిత్ సేన పూర్తి ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది.చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోయిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయి ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది.

చెపాక్‌ మైదానం.. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ఈ మైదానం పెట్టని కోటగా ఉంది. ఈ మైదానంలో 24 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 19 విజయాలను సొంతం చేసుకుంది. మందకొడిగా ఉండే చెపాక్‌ మైదానాన్ని తన కంచుకోటగా మార్చుకున్న చెన్నై జట్టు.. ఇక్కడ ప్రత్యర్థులను వరుసగా మట్టికరిపిస్తూ వస్తోంది. అయితే ముంబ‌య్ ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని సేన చితికిల బ‌డింది. ముంబ‌య్ పై ఘోర ప‌రాజ‌యం పాల‌య్యింది.

ఐపీఎల్‌ చాంపియన్స్‌ డెన్‌ అయిన చెప్పాక్‌లో చెన్నైని ఓడించే మంత్రాన్ని ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. వరుసగా మూడుసార్లు చెన్నైని సొంత మైదానంలో ఓడించిన ముంబై ఇండియన్స్‌.. తాజాగా ఫైనల్‌కు చేరుకుంది. విజ‌యంపై రోహిత్ స్పందించారు.

అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయగల బ్యాటింగ్‌ యూనిట్‌, వ్యూహాలు ఉండటమే చెప్పాక్‌లో తమ విజయానికి కారణమన్నారు. తమ జట్టు కూర్పు సమతూకంతో ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా దీటుగా ఆడగల నేర్పు ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారన్నారు. ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకొని.. ఆకళింపు చేసుకొని బాగా ఆడగలిగామని రోహిత్‌ ఆనందం వ్యక్తం చేశారు. 54 బంతుల్లో 71 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌పై రోహిత్‌ ప్రశంసల జల్లు కురిపించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -