Saturday, April 27, 2024
- Advertisement -

చెన్నైతో తలపడేదెవరు..?

- Advertisement -

ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. వరుస విజయాలతో దుసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ మొదటి క్వాలిఫైరయ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో చిత్తుగా ఓడి క్వాలిఫయర్ రెండో మ్యాచ్‌లో ముంబైతో అమీతుమికి సిద్ధమైంది.

క్వాలిఫయర్-2 మ్యాచ్ లో గెలిసిన జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ నెల 28న జరిగే ఫైనల్స్‌ లో తలపడనున్నాయి. ఐదు సార్లు టైటిల్ దక్కించుకున్న ముంబయి ఇండియన్స్ ఆరో టైటిల్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరో పక్క ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండోసారి కప్ కొట్టాలనే యోచనలో ఉంది గుజరాత్ టైటాన్స్.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు స్టార్ట్ చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక అతిథులను పిలిచేందుకు ప్లాన్ చేస్తుంది. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని దృవీకరించారు. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షులు ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు వస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌లో ఆసియా కప్ 2023 గురించి ప్రత్యేక అతిథులతో చర్చలు జరుపనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఈ సమయంలోనే ఆసియా కప్ భవిష్యత్తును కూడా నిర్ణయించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -