Wednesday, May 15, 2024
- Advertisement -

ఆర్సీబీ బిగ్‌ షాక్‌…. ఈ ఐపీఎల్ సీజ‌న్ నుంచి వైదొల‌గిన స్టార్ బౌల‌ర్

- Advertisement -

వ‌రుస ఓట‌ముల‌నుంచి ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు బిగ్ షాక్‌ తగిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన బౌల‌ర్ డేల్‌ స్టెయిన్‌ ఈ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగాడు.భుజానికి గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్టు స్టెయిన్‌ ప్రకటించాడు. తాజా సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టెయిన్ 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి వికెట్లు పడగొడుతూ బెంగళూరు టీమ్‌లో ఉత్సాహం నింపుతూ వచ్చాడు. స్టైన్ రాక‌తో బౌలింగ్‌లో బ‌ల‌హీనంగా ఉన్న ఆర్సీబీ పుంజుకుంది.

తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టు నాలుగు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ప్ర‌తీ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల్సిన స‌మ‌యంలో స్టెయిన్‌ దూరమడం ఆర్‌సీబీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -