Monday, May 5, 2025
- Advertisement -

ముంబైతో ఎస్‌ఆర్‌హెచ్‌..గెలుపెవరిదో?

- Advertisement -

ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. గత మ్యాచ్‌లో గెలుపు అంచువరకు వచ్చి ఓడిపోయింది హైదరాబాద్. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ పోరు జరగనుంది. ముంబై, హైదరాబాద్ రెండు తొలి మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాయి.

దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలుకాగా ముంబై సైతం తన సంప్రదాయాన్నే రీపిట్ చేస్తూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

నిన్న గుజరాత్ టైటాన్స్ పై చెన్నై ఘన విజయం సాధించి వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో గుజరాత్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై. పాయింట్ల పట్టికలో చెన్నై టాప్ ప్లేస్‌లో ఉండగా రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -