Saturday, May 3, 2025
- Advertisement -

ధోని రిటైర్మెంట్..టైమొచ్చింది!

- Advertisement -

మహేంద్రసింగ్ ధోని..టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వన్డేలు,టెస్టులు,టీ20లకు గుడ్ బై చెప్పిన ధోని..ఐపీఎల్‌లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. అయితే వాస్తవానికి గత సీజనే ధోనికి చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరిగినా ఈ ఏడాది కూడా అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.

ఇక తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది చెన్నై. ఇక ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండగా మరి ఈసారి రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ధోని ఫిట్ నెస్ లెవెల్స్ చూస్తే మరో రెండు ఐపీఎల్ సీజన్లు ఆడే అవకాశం ఉందని పఠాన్ చెప్పుకొచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు టైటిల్స్ అందించాడు ఎం‌ఎస్ ధోని. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించే టైమ్ లో ఎవరి ఊహలకు అందని రీతిలో సడన్ గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -