Tuesday, May 6, 2025
- Advertisement -

రాజ‌కీయాల్లోకి ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్లు…..?

- Advertisement -

రాజ‌కీయాల్లోకి ప్ర‌స్తుతం అన్ని రంగా వాల్లు అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో అనేక మంది క్రికెట‌ర్లు ఉన్న‌సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో ఇద్ద‌రు స్టార్ క్రికెట్ల‌రు ఆరంగేట్రం చేయనున్నట్లు వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌హేంద‌ర్ సింగ్ ధోనీ, గంభీర్‌లు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని చూస్తున్న భాజాపా అందుకు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. అందుకే క్రికెట‌ర్ల‌కు గాలం వేస్తోంది.ధోనీ, గంభీర్‌ను పార్టీలో చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతోంది.2019 ఎన్నికల్లోపు ఈ ఇద్దరు క్రికెటర్లను తమ పార్టీలో చేర్చుకుని కనీసం కొన్నిచోట్లయినా.. ప్రచారం చేయించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు ‘ద సండే గార్డియన్’ ఓ కథనాన్ని వెలువరించింది.

ఇప్పటికే ధోనీ, గంభీర్‌తో కమలనాథులు చర్చలు జరిపారని.. న్యూఢిల్లీ ఎంపీ సీటు గంభీర్‌కి ఇచ్చేందుకు పార్టీ సముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్తుతం న్యూఢిల్లీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న మీనాక్షి స్థానంలో గంభీర్‌కు టికెట్ ఇవ్వాల‌ని భాజాపా నిర్ణ‌యించుకుంది.

మరోవైపు ధోనీ‌‌కి ఉన్న ఆదరణ ద్వారా జార్ఖండ్‌లో పార్టీ పుంజుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా.. దక్షిణాదిన ఎక్కువ ప్రచారం చేయించుకోవాలని బీజేపీ ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం.అయితే ఇద్ద‌రూ క్రికెట్ నుంచి ఇప్పుడే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశాలు లేవు.ఈ నేపథ్యంలో.. ఇద్దరు క్రికెటర్లు రాజకీయాల్లోకి వెళ్తారా..? అనే చర్చ క్రీడా, రాజకీయ రంగాల్లో మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -