Saturday, April 27, 2024
- Advertisement -

భారమంతా పవన్‌పైనే..!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో జనసేనాని పవన్ ఊహించిందే జరుగుతోంది. బీజేపీతో చంద్రబాబును దగ్గర చేయడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పవన్ ఎట్టకేలకు సక్సెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ కావడం, బాబును ఎన్డీయేలోకి ఆహ్వానించడం చకచక జరిగిపోయాయి. రెండురోజుల్లో టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై పూర్తి క్లారిటీ రానుంది.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సీట్ల పంపకాల దగ్గరే అసలు సమస్య. వాస్తవానికి జనసేన -టీడీపీ పొత్తు ఖరారు తర్వాత పవన్ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై పవన్ తొలి నుండి క్లారిటీ అడుగుతూనే ఉన్నారు. అయితే దాటవేస్తూ వచ్చారు చంద్రబాబు. చివరికి పవన్ జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించగా దిగొచ్చిన బాబు… పవన్‌ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. తొలుత పవన్ 60కి పైగా ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలను డిమాండ్ జనసేనకు 25 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ సైతం 20 అసెంబ్లీ, 6 నుండి 8 ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తోంది. ఇన్ని స్థానాలను ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ప్రధానంగా బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తుండటంతో బీజేపీని ఒప్పించే బాధ్యతను చంద్రబాబు…పవన్ భుజాన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూడు పార్టీల మధ్య పోటీ చేసే స్థానాలు ఏంటనేది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -