Monday, April 29, 2024
- Advertisement -

స్టోక్స్‌కే స్టోక్ ఇచ్చిన పంజాబ్ ఆట‌గాల్లు మ‌యాంక్‌, మ‌నోజ్‌

- Advertisement -

ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో క్యాచ్‌లు అందుకుంటూ ఆటగాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నారు. ట్రెంట్ బౌల్ట్ బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్ చేరిస్తే.. ముంబై ఇండియన్స్‌పై కోహ్లి డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్ అందర్నీ అలరించింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి ఒడిసిపట్టిన తీరు అద్భుతం.

ఐపీఎల్‌లో ఇలాంటి అత్యద్భుత క్యాచ్‌ల జాబితాలో మరో క్యాచ్ చేరింది. కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్‌ అనిపించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా లాంగాఫ్‌లో మయాంక్‌ బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, అక్కడ తనను తాను నియంత్రించుకుంటూ బంతిని గాల్లోనే వేరే ఫీల్డర్‌ మనోజ్‌ తివారీకి అందివ్వడం మరొక ఎత్తు. చివరకు ఈ ఇద్దరూ కలిసి స్టోక్స్‌కు అదిరిపోయే స్ట్రోక్‌ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.

అదే క్యాచ్ కోసం మనోజ్ తివారి దూరం నుంచి పరిగెత్తుకొచ్చాడు. గాల్లోకి ఎగిరి అందుకున్నప్పటికీ.. తాను బౌండరీ లైన్‌ను తాకే అవకాశం ఉందని పసిగట్టిన మయాంక్ బంతిని తివారి వైపు విసిరాడు. అతడు బంతిని ఒడుపుగా అందుకోవడంతో నమ్మశక్యం కాని రీతిలో అవుటైన బెన్ స్టోక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మనోజ్‌ తివారీ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో మయాంక్‌ చేసిన ప్రయత్నం స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -