ఆసిస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. దీంతో సొంత జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో జట్టు ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదని విమర్శలు చేశారు. అయితే స్టార్క్‌కు మద్దతుగా నిలిచారు టీమిండియా కెప్టెన్ కోహ్లీ.
ఆసిస్ విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన స్టార్క్….ఏదొక సిరీస్‌లో రాణించలేకపోతే విమర్శలు చేయాలని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా గాడి తప్పడం సహజమేనని, అటువంటి తరుణంలో వారికి మద్దతుగా ఉండాలే తప్ప..విమర్శలు చేయడం సరికాదన్నారు.
జట్టులో చాలా ఏళ్లనుంచి స్టార్క్ ముఖ్యమైన బౌలర్‌గా కొనసాగుతున్నారు. స్టార్క్ మీ అత్యుత్తమ బౌలర్ అనుకుంటే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మళ్లీ గాడిలో పడటానికి అతనికి మద్దతుగా నిలవండి. అంతే కానీ విమర్శలు చేస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని హితవు పలికారు. టెస్ట్ సిరీస్‌లో స్టార్క్ 13 వికెట్లు తీశాడని కోహ్లీ గుర్తు చేశారు. భారత్‌తో త్వరలో ఆరంభం కానున్న వన్డే సిరీస్ నుంచి స్టార్క్‌కు విశ‍్రాంతినిచ్చారు.