Sunday, May 12, 2024
- Advertisement -

పిచ్చ వాగుడు వాగుతున్నా గేల్

- Advertisement -

సంచ‌ల‌నాల కోసం మాట్లాడ‌టం వేరు… త‌ల‌తిక్క‌తో మాట్లాడ‌టం వేరు! ప్ర‌ముఖ క్రికెట‌ర్ క్రిస్ గేల్ ఇన్నాళ్లూ మొద‌టి ర‌క‌మేమో అనిపించేది. ఎందుకంటే, ఎప్పక‌ప్పుడు మీడియాను ఎట్రాక్ట్ చేసే కామెంట్లు చేస్తుండేవారు. కానీ, ఇప్పుడు రెండో ర‌కం అని కూడా నిరూపించుకుని… వివాదాల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు.

టైమ్స్ దిన‌ప‌త్రిక‌కు చెందిన ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగేశాడు క్రిస్‌గేల్‌. ఎదురుగా ఉన్న‌దీ ఓ అమ్మాయీ.. అందునా ఒక జర్న‌లిస్టు అనే విచ‌క్ష‌ణా సంస్కారాలు లాంటివి ఏవీ లేకుండా నోటికొచ్చిన‌ట్టు విచ్చ‌ల‌విడిగా మాట్లాడేశాడు.

నువ్వు ఎప్పుడైనా ముగ్గురితో శృంగారం చేశావా అని గేల్ అడిగేస‌రికి ఆమె షాక్‌కి గురైందట‌. అంత‌టితో ఆగితే ఒక‌లా ఉండేది. ఆ త‌రువాతి నుంచి డ‌బుల్ మీనింగ్ డైలాగులు వేయ‌డం ప్రారంభించాడు. నా ద‌గ్గ‌ర ఉన్న బ్యాట్ చాలా పెద్దది అన్నాడ‌ట‌! న‌ల్ల‌జాతి వారితో శృంగారం ఎప్పుడైనా చేసిన అనుభ‌వం నీకు ఉందా.. క‌చ్చితంగా ఉండే ఉన్న‌ట్టుగానే ఉంది నీ ముఖం చేస్తుంటే అని కామెంట్ చేశాడు. త‌మ దేశంలో శృంగారం అనేది కేవ‌లం ఎంజాయ్‌మెంట్ కోసం చేస్తార‌నీ, మ‌హిళ‌లే ఎక్కువ‌గా సెక్స్‌ను ఎంజాయ్ చేస్తారు అనీ, ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లు ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు భ‌ర్త‌కు ఏం కావాలో స‌రిగా చూసుకోవాల‌నీ.. ఇలా నోటికి వ‌చ్చింది వాగేశాడు. ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గేల్ కామెంట్స్ పై పెద్ద దుమార‌మే రేగుతోంది. ఒక మ‌హిళ‌తో గేల్ ఇంత నీచంగా మాట్లాడ‌టంపై అంద‌రూ దుమ్మెత్తి పోస్తున్నారు. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయినా… ఇదేం పోయేకాలం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -